ముందస్తుగా సునామీలను పసిగట్టగలం

ABN , First Publish Date - 2020-12-26T08:40:12+05:30 IST

పెద్ద ఎత్తున ప్రాణాలను హరించే సునామీలను ముందస్తుగా పసిగట్టి ప్రభుత్వాలు, ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధానమని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డా.శ్రీనివాస కుమార్‌ తెలిపారు. ఈ విషయంలో శాస్త్రీయంగా, సాంకేతికంగా పురోగతి సాధించామని చెప్పారు. హిందూ మహా సముద్ర తీర

ముందస్తుగా సునామీలను పసిగట్టగలం

ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం

2004 భయంకర సునామీకి 16 ఏళ్లు: ఇన్‌కాయిస్‌


హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పెద్ద ఎత్తున ప్రాణాలను హరించే సునామీలను ముందస్తుగా పసిగట్టి ప్రభుత్వాలు, ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధానమని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డా.శ్రీనివాస కుమార్‌ తెలిపారు. ఈ విషయంలో శాస్త్రీయంగా, సాంకేతికంగా పురోగతి సాధించామని చెప్పారు. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో 2004 డిసెంబరు 26న సంభవించిన అతి భయంకర ‘సుమత్ర’ సునామీకి శనివారంతో 16 ఏళ్లు పూర్తవుతాయని వివరించారు. ఈ సునామీ తర్వాత 2007 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ఇన్‌కాయి్‌సలో ఏర్పాటు చేసిన ‘ఇండియన్‌ సునామీ అర్లీ వార్నింగ్‌ సిస్టం(ఐటీఈడబ్ల్యూఎస్‌) కేంద్రం ద్వారా  మహాసముద్రంలో సునామీ సంబంధ భూకంపాలను కచ్చితమైన సమయంలో అంచనా వేసి ప్రభుత్వాలకు సమాచారమిస్తున్నామని చెప్పారు. భూకంపాలకు 10 నిమిషాల ముందుగానే ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌, ఫ్యాక్స్‌, జీటీఎస్‌ ద్వారా సమాచారం చేరవేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ఇతర 25 దేశాలకు కూడా సమాచారాన్ని పంపిస్తున్నామన్నారు.

Updated Date - 2020-12-26T08:40:12+05:30 IST