గ్రేటర్ వార్‌కి సిద్ధమవుతున్న రథాలు

ABN , First Publish Date - 2020-11-19T17:41:50+05:30 IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన పార్టీలు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

గ్రేటర్ వార్‌కి సిద్ధమవుతున్న రథాలు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన పార్టీలు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసుకుంటున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ప్రచార రథాలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎన్నికల రథాలు తయారు చేసే కళాకారులు బిజీ బిజీ అయిపోయారు. ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు  ప్రధాన పార్టీలు పోటీపడతాయి. గల్లీ గల్లీలోనూ తిరుగుతూ ప్రచారం చేస్తాయి. ప్రచారం కోసం ప్రత్యేకమైన వాహనాలను సిద్ధం చేసుకుంటాయి. ఎన్నికలు ఏవైనా పార్టీల ప్రచార రథాలు మాత్రం రోడ్లమీద ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.


జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి మొదలుకావడంతో ప్రచార రథాల తయారీ కూడా ఊపందుకుంది. డిసెంబర్ 1న గ్రేటర్ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోడానికి ఈనెల 29వరకే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచార రథాలపై ఫోకస్ పెట్టాయి. తమకు నచ్చినట్టుగా వాహనాలను రెడీ  చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల నాయకులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చారు.

Updated Date - 2020-11-19T17:41:50+05:30 IST