కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా

ABN , First Publish Date - 2020-09-19T02:37:52+05:30 IST

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రారంభోత్సవ వివరాలు అధికారులు

కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా

హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రారంభోత్సవ వివరాలు అధికారులు తెలియజేయనున్నారు. తొలుత ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కురుస్తున్న అధిక వర్షాల వల్ల ప్రారంభోత్సం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండేలా… ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. మొత్తం రూ.184 కోట్లను దీని నిర్మాణానికి వ్యయం చేశారు. రెండేళ్ళలో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్&టీకి అప్పగించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే. 

Updated Date - 2020-09-19T02:37:52+05:30 IST