రేపు మంత్రివర్గ సమావేశం

ABN , First Publish Date - 2020-05-18T02:31:29+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సాయంత్రం ఐదు గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం ప్రారంభమవుతుంది.

రేపు మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సాయంత్రం ఐదు గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం ప్రారంభమవుతుంది.


లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో నియంత్రిత విధానంలో పంటల సాగు చేసే విధివిధానాలపై కూడా చర్చించే అవకాశముంది.

Updated Date - 2020-05-18T02:31:29+05:30 IST