రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2020-04-14T21:46:57+05:30 IST

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని..

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: మంత్రి గంగుల

కరీంనగర్: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరోనా వైరస్‌తో ప్రభుత్వం ఆదాయం భారీగా పడిపోయిందని.. అయినా రైతాంగానికి ఇబ్బందులు రానివ్వమని అన్నారు. ఖరీఫ్ రైతుబంధు డబ్బులకు సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నా.. రైతులు సంతోషంగా ఉండాలనూ భావనతో సీఎం కేసీఆర్ తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు. రైతు పండించిన పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోనుగోలు చేయాలని సూచించారన్నారు. రైతు పండించిన పంటను ఆ ఊర్లోనే అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గుంపులు గుంపులుగా రాకుండా రైతుకు కేటాయించిన టోకెట్ ప్రకారం అమ్ముకునే విధానం కల్పించామన్నారు. 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనుకున్నామని మంత్రి గంగుల కమాలాకర్ చెప్పారు. 

Updated Date - 2020-04-14T21:46:57+05:30 IST