బస్‌పాస్‌దారులకు తీపి కబురు
ABN , First Publish Date - 2020-10-31T17:01:10+05:30 IST
బస్‌పాస్‌లను వినియోగించే వారికి ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. లాక్‌డౌన్‌కు ముందు పాస్ రెన్యువల్ చేసుకుని ఉపయోగించుకోలేని వారికి నష్టపోయిన రోజుల కోసం కొత్త బస్‌పాస్‌ను ఇవ్వనుంది.

హైదరాబాద్ : బస్‌పాస్‌లను వినియోగించే వారికి ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. లాక్‌డౌన్‌కు ముందు పాస్ రెన్యువల్ చేసుకుని ఉపయోగించుకోలేని వారికి నష్టపోయిన రోజుల కోసం కొత్త బస్‌పాస్‌ను ఇవ్వనుంది. ఆర్టీసీ అన్ని సర్వీసుల బస్ పాస్‌హోల్డర్స్ అప్పటి బస్‌పాస్‌కు సంబంధించిన ఐడీ కార్డు, టికెట్‌ను సమీపంలోని కౌంటర్‌లో అందజేస్తే కొత్త పాస్‌ను ఇస్తారు. నవంబర్ 30 వరకు దాన్ని వినియోగించుకోవచ్చు.