అటవీ అధికారి వద్ద నోట్ల కట్టలు..!

ABN , First Publish Date - 2020-12-13T07:54:13+05:30 IST

బిల్లులు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఇన్‌చార్జి డైరెక్టర్‌పై అవినీతి నిరోధక

అటవీ అధికారి వద్ద నోట్ల కట్టలు..!

ఇన్‌చార్జి హోదా ముగిసేరోజే అవినీతి కేసు

డిప్యూటీ కన్జర్వేటర్‌, ఇన్‌చార్జి డైరెక్టర్‌ అరెస్టు

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): బిల్లులు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఇన్‌చార్జి డైరెక్టర్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అర్బన్‌ ఫారెస్టరీ ఆఫీ్‌సలో ఇనపనూరి ప్రకాశ్‌ 2016 నుంచి డిప్యూటీ కన్జర్వేటర్‌గా పనిచేస్తున్నాడు. జూలైలో ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇన్‌చార్జి పదవి శుక్రవారంతో ముగియనుండటంతో వారం, పది రోజులుగా కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. పాత తేదీలతో బిల్లులు మంజూరు చేశాడు. కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు దాడులు జరిపారు.


నానక్‌రాంగూడలోని కార్యాలయంలో రూ.10.50 లక్షలు, అధికారిక వాహనంలో రూ.20వేలు, దూలపల్లిలోని నివాసంలో రూ.5.15 లక్షలను సీజ్‌ చేశారు. కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించిన 26 పెడింగ్‌ ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశ్‌ను అరెస్టు చేశారు.

కాగా.. చేయని పనులను.. కాగితాల మీద చేసినట్లు చూపించి బిల్లులు జారీ చేయడం ప్రకాశ్‌ నేరశైలి అని.. హైదరాబాద్‌ శివార్లలో పచ్చదనానికి సంబంధించి ఇలాంటి మోసాలు జరిగాయని అధికారులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి ప్రకాశ్‌కు సహకరించిన కాంట్రాక్టర్లు, ఇతరులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.


Updated Date - 2020-12-13T07:54:13+05:30 IST