బ్రిటన్‌ స్ట్రెయిన్‌ భయంకరమైంది కాదు: ఈటల

ABN , First Publish Date - 2020-12-30T07:40:06+05:30 IST

బ్రిటన్‌ స్ట్రెయిన్‌ భయంకరమైనదేమీ కాదని, దీనికి ఎక్కువగా చంపే శక్తి లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు

బ్రిటన్‌ స్ట్రెయిన్‌ భయంకరమైంది కాదు: ఈటల

బ్రిటన్‌ స్ట్రెయిన్‌ భయంకరమైనదేమీ కాదని, దీనికి ఎక్కువగా చంపే శక్తి లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. కొత్త వైర్‌సతో ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఈ స్ట్రెయిన్‌ ప్రమాదకారి కాదని, కానీ ఎక్కువ మందికి వ్యాప్తి కలిగేలా చేస్తుందని నిపుణులు చెప్తున్నారని తెలిపారు. కొత్త వైర్‌సను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒక్క కేసుతోనే ఈ వైర్‌సను కట్టడి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు పండుగల కంటే ప్రాణాలు ముఖ్యమన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. కొత్త స్ట్రెయిన్‌ పాజిటివ్‌లకు కూడా ప్రస్తుతం పాత పద్ధతిలోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.   

Updated Date - 2020-12-30T07:40:06+05:30 IST