వధువులు, వరులూ ఇద్దరూ కవలలే!

ABN , First Publish Date - 2020-12-11T08:16:57+05:30 IST

కవలలైన అన్నదమ్ములు, కవలలైన అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న అరుదైన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో గురువారం జరిగింది.

వధువులు, వరులూ ఇద్దరూ కవలలే!

మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంటలు

కేసముద్రం, డిసెంబరు 10 : కవలలైన అన్నదమ్ములు, కవలలైన అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న అరుదైన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో గురువారం జరిగింది.

గ్రామానికి చెందిన అంబాల మల్లికార్జున్‌, సుజాత దంపతులకు పెద్ద కుమారుడు శరత్‌తోపాటు కవలలు మహేష్‌, నరేష్‌ ముగ్గురు కుమారులు. కవలలు ఇద్దరూ డిగ్రీ పూర్తి చేసి తండ్రికి తోడుగా వ్యవసాయంలో సహాయపడుతూ చిన్న కిరాణాదుకాణం నడుపుకుంటున్నారు. హైదరాబాద్‌లో మధ్య తరగతికి చెందిన నేరెళ్ల వీరభద్రం, మంగమ్మ దంపతులకు పెద్ద కుమార్తెతోపాటు కవలలు శాంతి, ప్రశాంతి ముగ్గురు కుమార్తెలు. మహే్‌షకు శాంతితో, నరే్‌షకు ప్రశాంతితో వెంకటగిరి గ్రామంలో వివాహం జరిపించారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు కవలలైన రెండు జంటలను ఆసక్తిగా చూశారు. 


Updated Date - 2020-12-11T08:16:57+05:30 IST