స్వీయ నియంత్రణతోనే బ్రేక్‌

ABN , First Publish Date - 2020-04-01T08:23:40+05:30 IST

స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతామని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ అన్నారు. సమాచార, పౌర సంబంధాల

స్వీయ నియంత్రణతోనే బ్రేక్‌

కరోనా కట్టడికి ఐపీఎం డైరెక్టర్‌ సలహా

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతామని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ అన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడారు.  కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 77 పాజిటివ్‌ కేసులు తేలాయని, ఇందులో 14 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.   విదేశాల నుంచి వచ్చేవారు హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ చేతులపై ముద్రలు వేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్‌ సునీతారెడ్డి కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-01T08:23:40+05:30 IST