హెచ్‌ఎండీఏ టౌన్‌షిప్‌లకు బ్రేక్‌..

ABN , First Publish Date - 2020-12-11T14:12:13+05:30 IST

నగరానికి నలువైపులా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో

హెచ్‌ఎండీఏ టౌన్‌షిప్‌లకు బ్రేక్‌..

హైదరాబాద్‌ : ఉప్పల్‌ భగాయత్‌ తరహాలో నగరానికి నలువైపులా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మినీ టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేసే ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. మూడు నెలలుగా రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో హెచ్‌ఎండీఏకు భూములిచ్చే రైతులతో ఒప్పందాలు చేసుకోవడానికి వీలుకావడం లేదు. ఒప్పంద ప్రక్రియలు జరగకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నగర శివారులోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపురం, మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని బోగారం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని లేమూరు, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలోని ఇన్మూల్‌ నర్వా గ్రామాల్లో హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లో భాగంగా భూములిచ్చేందుకు రైతులు అంగీకరించారు.


ఆయా గ్రామాల్లో రైతుల నుంచి భూములను సేకరించేందుకు అధికారులు పలుమార్లు పరిశీలించారు. భూ వివాదాలు, కోర్టు కేసులు లేని భూముల సేకరణకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. కందుకూరు మండలం లేమూరులో 77.37 ఎకరాలు, కొత్తూరు మండలం పరిధి ఇన్మూల్‌ నర్వాలోని ఏడు సర్వే నెంబర్లలోనూ, ఫరుఖ్‌నగర్‌ మండలం వెల్జర్ల పరిధిలో మరో రెండు సర్వే నెంబర్లలో 75.39 ఎకరాలు సేకరించడానికి హెచ్‌ఎండీఏ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేసి అభ్యంతరాలను స్వీకరించారు. ఈ రెండు ప్రాంతాల్లోని భూములపై ఎలాంటి వివాదాలు లేకపోవడంతో రైతులతో ఒప్పందా లు చేసుకునేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. టౌన్‌షి్‌పల ఏర్పాటుకు డ్రాఫ్ట్‌ లేఅవుట్లను కూడా సంస్థ సిద్ధం చేసింది. అయితే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ఇంకా జరగకపోవడంతో ఆ టౌన్‌షి్‌పలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.


Updated Date - 2020-12-11T14:12:13+05:30 IST