భద్రాద్రిలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-03-25T10:17:38+05:30 IST

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి ఏప్రిల్‌ 8 వరకు వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌

భద్రాద్రిలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

నవమికి సీఎంను ఆహ్వానించకపోవడం తొలిసారి

భద్రాచలం, జనవరి 24: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి ఏప్రిల్‌ 8 వరకు వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న క్రమంలో ఈ సారి ఉత్సవాలను భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ రెండో తేదీన శ్రీరామనవమి రోజున సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అంతరాలయంలో నిర్వహించనున్నారు.  25న ఉగాది సందర్భంగా నూతన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 29న ఉత్సవాంగ స్నపనం, 30న ధ్వజపట భద్రుక మండల లేఖనం, గరుడాధివాసం,  31న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహనం, చతుఃస్థానార్చనము, ఏప్రిల్‌ ఒకటిన ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏప్రిల్‌ 2న శ్రీ సీతారాముల తిరు కల్యాణోత్సవం నిర్వహించనుండగా, 3న శ్రీరామమహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.  భద్రాద్రి రామయ్య కల్యాణానికి తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించటం లేదు. 

Updated Date - 2020-03-25T10:17:38+05:30 IST