8 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం

ABN , First Publish Date - 2020-11-03T07:18:01+05:30 IST

ఎనిమిదేళ్ల చిన్నారిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని ఓ

8 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం

కోహీర్‌, నవంబరు 2: ఎనిమిదేళ్ల చిన్నారిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఆ బాలుడు కుర్‌కురే ప్యాకెట్‌ ఇస్తానని ఆశ చూపి అత్యాచారం చేశాడు. ]\

అంతలోనే బాలిక మేనమామ రావడంతో విషయం తెలిసింది. వెంటనే ఆయన కోహీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-11-03T07:18:01+05:30 IST