ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన కవిత
ABN , First Publish Date - 2020-07-12T21:07:04+05:30 IST
రాష్ట్ర ప్రజలకు మాజీ ఎంపీ కవిత బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మాజీ ఎంపీ కవిత బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని కవిత చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బోనాల జాతర కళ తప్పింది. ఆలయ చరిత్రలోనే మొదటిసారి భక్తులు ఆలయంలో అమ్మవారికి కాకుండా ఇంటివద్దే బోనాలు సమర్పించుకుంటున్నారు. అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే బోనాల జాతర జరుగుతుండడం చరిత్రలో ఇదే మొదటిసారి.