లాల్‌దర్వాజ అమ్మవారికి బంగారు బోనం

ABN , First Publish Date - 2020-07-19T23:29:54+05:30 IST

పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీమహంకాళీ అమ్మవారి దేవాలయంలో ఆదివారం బోనాలు నిరాడంబరంగా జరిగాయి

లాల్‌దర్వాజ అమ్మవారికి బంగారు బోనం

హైదరాబాద్‌: పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీమహంకాళీ అమ్మవారి దేవాలయంలో ఆదివారం బోనాలు నిరాడంబరంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా అమ్మవారి ఆలయ కమిటీ తరపున కమిటీ ఛైర్మన్‌ జె.లక్ష్మీనారాయణగౌడ్‌ ఆయన కుటుంబ సభ్యులు అమ్మవారికి బంగారుబోనం సమర్పించారు. అలాగే ప్రభుత్వం తరపున పంపిన పట్టు వస్ర్తాలను కూడా అమ్మవారికి సమర్పించారు. 

Updated Date - 2020-07-19T23:29:54+05:30 IST