టీఎన్జీఓఏ నేతలకు అభినందనలు

ABN , First Publish Date - 2020-06-19T03:33:31+05:30 IST

టీఎన్జీఓఏ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్ లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభినందించారు.

టీఎన్జీఓఏ నేతలకు అభినందనలు

హైదరాబాద్ : టీఎన్జీఓఏ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్ లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభినందించారు.


టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులుగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారు గురువారం మర్యాద పూర్వకంగా వినోద్ కుమార్ ను మినిస్టర్స్ క్వార్టర్స్ లోని అధికార నివాసంలో కలిశారు.


ఈ నేపథ్యంలో వారిద్దరినీ వినోద్ కుమార్ సన్మానించి అభినందించారు. నాయకులుగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని, ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని వినోద్ కుమార్ ఆకాక్షించారు.

Updated Date - 2020-06-19T03:33:31+05:30 IST