అలరిస్తున్న బోడకొండ జలపాతం

ABN , First Publish Date - 2020-09-16T20:17:58+05:30 IST

మంచాల మండలం, బోడకొండ అడవిలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.

అలరిస్తున్న బోడకొండ జలపాతం

రంగారెడ్డిజిల్లా: మంచాల మండలం, బోడకొండ అడవిలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చదనం, కొండలు, వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను కట్టిపడేస్తోంది. అలాగే సినిమా షూటింగ్‌లతో మరింత సందడి వాతావరణం నెలకొంది.


హైదరాబాద్ మహానగరానికి దగ్గరలో ఉండడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు బోడకొండ అడవులకు చేరుకుంటున్నారు. కరోనా ప్రభావాన్ని సయితం లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలివస్తున్నారు. కొండకోనలనుంచి వస్తున్న నీటిలో దిగి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.


ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో సినిమా షూటింగులు కూడా జరుగుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరి సినిమా షూటింగ్ జరిగింది. హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి బోడకొండ వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో వారిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. ఓవైపు ప్రకృతి అందాలు, మరోవైపు సినిమా షూటింగ్‌లతో బోడకొండ అడవిలో సందడి వాతావరణం నెలకొంది.

Updated Date - 2020-09-16T20:17:58+05:30 IST