తలసేమియా రోగులకు రక్తం కొరత
ABN , First Publish Date - 2020-03-27T10:25:34+05:30 IST
కరోనా ప్రభావం రక్తదాన శిబిరాలపై పడింది. నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ... ఆ రక్తాన్ని తలసేమియా రోగులకు అందించే రెడ్‌క్రాస్ సొసైటీలో రక్తం నిండుకుంది
సైనికులు, పోలీసుల నుంచి సేకరించాలని నిర్ణయం
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి ): కరోనా ప్రభావం రక్తదాన శిబిరాలపై పడింది. నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ... ఆ రక్తాన్ని తలసేమియా రోగులకు అందించే రెడ్‌క్రాస్ సొసైటీలో రక్తం నిండుకుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం రాజ్‌భవన్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. రోజూ 20 నుంచి 30 యూనిట్ల రక్తం తలసేమియా రోగులకు అవసరం ఉండటంతో ఈ కొరతను తగ్గించడానికి సైనికులు, పోలీసుల నుంచి రక్తం సేకరించాలని ఆమె ఆదేశించారు.