బాంజీపేటలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2020-04-18T08:57:29+05:30 IST

నర్సంపేట మండలం బాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు.

బాంజీపేటలో రక్తదాన శిబిరం

నర్సంపేట, ఏప్రిల్‌ 17 : నర్సంపేట మండలం బాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్‌, సీఎం పిలుపు మేరకు రక్త నిల్వలను పెంచడానికి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.


నియోజకవర్గంలో 12 సెంటర్లలో ఈనెల 22 వరకు రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుం  దన్నారు. 6వేల యూనిట్ల రక్తం సేకరించాలని లక్ష్యం ఎంచుకున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో ఎస్సై నవీన్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అద్యక్షుడు నామాలసత్యనారాయణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-04-18T08:57:29+05:30 IST