భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయి: వీహెచ్

ABN , First Publish Date - 2020-06-23T01:11:10+05:30 IST

భగవంతుని ఆశీస్సులు తనకు ఉంటాయని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయి: వీహెచ్

హైదరాబాద్‌: భగవంతుని ఆశీస్సులు తనకు ఉంటాయని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల పెత్తనం నడుస్తోందని, అధిష్టానం ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కొందరు డిల్లీలో కూర్చొని పెత్తనం చేస్తున్నారని, వాస్తవాలను అధిష్టానానికి చెప్పనివ్వడం లేదని ఆరోపించారు. ఢిల్లీలో ఉన్నవారు వాస్తవాలను తమ పార్టీ నేతలు సోనియా, రాహుల్‌కు చెప్పడం లేదని హనుమంతరావు అన్నారు.


హనుమంతరావు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురైన ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వీహెచ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Read more