రైతులకు వరం రెవెన్యూ చట్టం

ABN , First Publish Date - 2020-09-14T11:00:35+05:30 IST

రైతుల పాలిట వరంగా నూతన రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి

రైతులకు వరం రెవెన్యూ చట్టం

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


కొడకండ్ల, సెప్టెంబరు 13: రైతుల పాలిట వరంగా నూతన రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. కొడకండ్లలోని పద్మశాలి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నతంగా, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు. నిజాం నాటి సర్వే, రికార్డులను సరిచేసే పనికి శ్రీకారం చుట్టి కేసీఆర్‌ రైతుబాంధవుడు అయ్యాడన్నారు. అలాగే కరోనా మహమ్మారికి ఎవరూ భయపడవద్దని, ప్రతీ ఒక్కరికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లా గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయంలో 94 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కేలోత్‌ సత్తెమ్మ, తహసీల్దార్‌ యాకన్న, ఏఎంసీ చైర్మన్‌ పేరం రాము, సిందె రామోజీ, దీకొండ వెంకటేశ్వర్‌రావు, అమరేందర్‌రెడ్డి, మేటి శ్రీరాములు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

దేవరుప్పుల : కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పులలోని తిరుమల గార్డెన్‌లో ఆదివారం పలు గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బస్వ సావిత్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ గ్రామాల్లో విస్తరిస్తున్న కరోనాను అరికట్టడం మన చేతిలోనే ఉందన్నారు. ప్రజల నుంచి పలు సూచనలు తీసుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరుగగా రానున్న గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సమాయత్తం కావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ స్వప్న, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేష్‌రెడ్డి, కొడకండ్ల మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కృష్ణమూర్తి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ నర్సింహారెడ్డి, సర్పంచ్‌ రమాదేవి, టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, నాయకులు బస్వ మల్లేశం, పల్ల సుందర్‌రాంరెడ్డి, విక్రమ్‌రెడ్డి, చింత రవి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-14T11:00:35+05:30 IST