కేసీఆర్ మెప్పు కోసమే సంజయ్‌పై విమర్శలు
ABN , First Publish Date - 2020-12-30T04:13:17+05:30 IST
కేసీఆర్ మెప్పు కోసమే సంజయ్‌పై విమర్శలు
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్
కాటారం, డిసెంబరు 29 : కేసీఆర్ మెప్పు కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై బాల్క సుమన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాగె రంజిత్‌కుమార్ విమర్శించారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో మంగళవారం ఐదు మండలాల బీజేవైఎం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితులను మోసం చేసిన టీఆర్‌ఎస్‌లో ఉంటూ దళితుడి ముసుగులో సుమన్ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. దమ్ము, ధైర్యం ఉంటే ఉస్మానియా విశ్వ విద్యాలయానికి వెళ్లి మాట్లాడాలన్నారు. కేంద్ర నిధులు ఎన్ని వచ్చాయో ఫాంహౌజ్‌లో ఉన్న కేసీఆర్‌ను అడిగితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇమేజ్‌ను పెంచుకోవడం కోసం బండి సంజయ్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్, సునీల్, నవీన్, శ్రీకాంత్, హర్ష తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లిలో రాస్తారోకో
భూపాలపల్లి కలెక్టరేట్ : నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వ హించారు. ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నినదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ. 3016 చెల్లించాలన్నారు. రాస్తారోకోలో బీజేవైఎం నేతలు కిశోర్‌రెడ్డి, మంద మహేష్, సురేష్, ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.