హరీశ్ రావును ప్రచారం నుంచి వెనక్కి పిలవండి : ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

ABN , First Publish Date - 2020-10-27T21:44:25+05:30 IST

అధికార యంత్రాంగం దుబ్బాకలో అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌కు దాసోహమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు

హరీశ్ రావును ప్రచారం నుంచి వెనక్కి పిలవండి : ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

హైదరాబాద్:  అధికార యంత్రాంగం దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు దాసోహమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అక్రమ అరెస్టును తాము ఖండిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట సీపీ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని, ఎన్నికల సంఘం పరిధిలో పని చేయాల్సింది పోయి, టీఆర్‌ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట సీపీని వెంటనే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పక్షానికి చెందిన ఎంపీలను, జెడ్పీటీసీలను ప్రతి గ్రామంలో మోహరించి, అధికారుల విధి నిర్వహణకు అడ్డుపడున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ఆ జిల్లాలకు సంబంధం లేని అధికారులకు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.


మంత్రి హరీశ్ రావు అభ్యర్థి సుజాత కంటే ఎక్కువగా ప్రచారం చేస్తూ... అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి మంత్రి హరీశ్ రావును ఎన్నికల సంఘం తక్షణమే ప్రచారం నుంచి వెనక్కి పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్ని పార్టీలకూ ప్రచారం చేసుకునే హక్కు ఉందని, అయితే బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేయకుండా అధికార పక్షం అడ్డు తగులుతోందని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికలు సక్రమంగా జరగాలంటే సీపీని, ఇన్‌చార్జి మంత్రిని హరీశ్ రావును వెంటనే వెనక్కి పిలవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-10-27T21:44:25+05:30 IST