కార్గిల్ అమరుల స్ఫూర్తితో చైనా కుట్రలకు అడ్డుకట్ట
ABN , First Publish Date - 2020-07-27T08:34:51+05:30 IST
కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో మన సైన్యం, చైనా కుట్రలను తిప్పికొడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో మన సైన్యం, చైనా కుట్రలను తిప్పికొడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం, విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సైనికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపారన్నారు. దేశం కోసం అమరులైన సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని సంజయ్ కొనియాడారు.