కరోనా నిధులపై శ్వేతపత్రం ఇవ్వండి

ABN , First Publish Date - 2020-07-22T08:37:57+05:30 IST

తెలంగాణలో కరోనా నియంత్రణకు వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన నిధు

కరోనా నిధులపై శ్వేతపత్రం ఇవ్వండి

  • సీఎంకు బండి సంజయ్‌ లేఖ

హైదరాబాద్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా నియంత్రణకు వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన నిధు లు, చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సీఎం సహాయ నిధికి వచ్చిన విరాళాల వివరాలు కూడా వెల్లడించాలని మంగళవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కరోనా నియంత్రణకు సీఎం రూ.వంద కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు తనకు మీడియా ద్వారా తెలిసిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉంటే కేంద్రాన్ని అడగొచ్చు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా నిధుల కోసం కృషి చేస్తా’’ అని సంజయ్‌ చెప్పారు. కరోనా కట్టడిలో అధికారుల వైఫ ల్యాన్ని, నిర్లక్ష్యాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందని, ప్రజల ప్రాణాలు కాపాడాలని ఉన్నత న్యాయస్థానం చెప్పే దుస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. కొవిడ్‌ విషయంలో నిజాలు దాచి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని కోరారు. ‘‘కరోనాకు సంబంధించి ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది’’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-07-22T08:37:57+05:30 IST