విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు: రామచంద్రరావు

ABN , First Publish Date - 2020-07-23T02:14:17+05:30 IST

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు: రామచంద్రరావు

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు: రామచంద్రరావు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని బీజేపీ నేత రామచంద్రరావు ప్రభుత్వానికి సూచించారు. పాఠ్యపుస్తకాల పంపిణీ పేరుతో చిన్నారులకు ప్రభుత్వం కరోనా పంచాలని చూస్తోందని బీజేపీ నేత రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం కోసమే ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ నిర్వహించాలనుకుంటోందని ఆయన మండిపడ్డారు. జీతాలు అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారని, ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ నేత రామచంద్రరావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-07-23T02:14:17+05:30 IST