నేపాల్‌కు భారత్ అండగా ఉంది కాబట్టే...: రాజాసింగ్

ABN , First Publish Date - 2020-07-14T21:58:34+05:30 IST

అయోధ్య రామ మందిరంపై నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత రాజసింగ్ ఖండించారు.

నేపాల్‌కు భారత్ అండగా ఉంది కాబట్టే...: రాజాసింగ్

హైదరాబాద్: అయోధ్య రామ మందిరంపై నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత రాజసింగ్ ఖండించారు. అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్ ప్రధానికి లేదన్నారు. రాముని జన్మస్థలం ముమ్మాటికీ అయోధ్యనే అన్నారు. చైనా మెప్పుకోసం నేపాల్ ప్రధాని లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. నేపాల్‌లో ఉన్న అనేక హిందు దేవాలయాలను పునరుద్ధరించాలన్నారు. భారత్‌లో అనేకమంది నేపాల్  దేశస్తులు జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు నేపాల్‌కు భారత్ అండగా ఉంది కాబట్టే...చైనా నేపాల్‌ను ఆక్రమించలేదు..లేదంటే ఎప్పుడో  నేపాల్ పై చైనా నిజస్వరుపాన్ని చూపేదన్నారు. 

Updated Date - 2020-07-14T21:58:34+05:30 IST