బీజేపీ శ్రేణుల నిరసన
ABN , First Publish Date - 2020-12-29T04:21:40+05:30 IST
బీజేపీ శ్రేణుల నిరసన

దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని ధర్నా
కృష్ణకాలనీ, డిసెంబరు 28: ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్ర భుత్వం దళితులకు వెంటనే మూడెకరాల భూమివ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదు ట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భట్టు రవి, ఇచ్చంతల విష్ణు, కోరే సుధాకర్, ఊరటి మునేందర్, పడగంటి పురుషోత్తం, నర్సయ్య, రరవికుమార్, వీరబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
కాటారం : దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మన భాస్కర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాగె రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్‌కు వినతిపత్రం అందించారు. మధుసూదన్, రాజేందర్, రామచంద్రం, బాలయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
గణపురం : బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దళిత మోర్చా జిల్లా మాజీ అధ్యక్షుడు దుప్పటి భధ్రయ్య నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు మంద మహేష్, సోమ దామోదర్, బొద్దుల మొగిళి తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర వెంకటేశ్, కంచు కుమారస్వామి, మాచర్ల రఘు, నాయకులు రవీందర్, చెక్క నర్సయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.
టేకుమట్లలో రాస్తారోకో
టేకుమట్ల : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసనకు దిగింది. మండల కేంద్రంలో ని ప్రధాన రహదారిపై ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ చందా నరే్‌షకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలందరికీ డబుల్ బె డ్‌రూం ఇళ్లు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గీత సుమన్‌రెడ్డి, బట్టల మొగిళి, కొలుగూరి రమేష్, సదయ్య, బిక్కినేని సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.