సీఎం జగన్ మాట్లాడిన అంశాల్లో తప్పేం లేదు: డీకే అరుణ

ABN , First Publish Date - 2020-10-07T22:57:43+05:30 IST

అపెక్స్ కౌన్సిల్‌లో ఏపీ సీఎం జగన్ మాట్లాడిన అంశాల్లో తప్పేం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు

సీఎం జగన్ మాట్లాడిన అంశాల్లో తప్పేం లేదు: డీకే అరుణ

ఢిల్లీ: అపెక్స్ కౌన్సిల్‌లో ఏపీ సీఎం జగన్ మాట్లాడిన అంశాల్లో తప్పేం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జలవివాదానికి పరిష్కారం తీసుకొస్తారని భావించాం. ప్రాజెక్టులపై అభ్యంతరాలను కేసీఆర్ సరిగా వ్యక్త పర్చలేదు. అడ్డగోలుగా ప్రాజెక్టుల అంచనాలు పెంచారు. పాలమూరు ప్రాజెక్టుకు న్యాయం చేసేలా సీఎం కేసీఆర్ వ్యవహరించలేదు. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కట్టే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం. కేసీఆర్ కోర్టుకు వెళ్లకపోతే ట్రిబ్యునల్ ఏర్పడేది.. ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కేసీఆర్ తప్పుల వల్లే రాష్ట్రం నీటిని కోల్పోతోంది’ అని డీకే అరుణ ఆరోపించారు.

Read more