టీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు

ABN , First Publish Date - 2020-12-31T04:00:14+05:30 IST

టీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు

టీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి


భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 30: టీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదని వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భూపాలపల్లిలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల ఓటుతో గద్దెనెక్కిన కేసీఆర్‌ ఇప్పుడు వారిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీని గెలిపించి శాసన మండలిలో గళం విప్పే అవకాశం కల్పించాలని కోరారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి,  జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:00:14+05:30 IST