బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కరోనా నెగిటివ్

ABN , First Publish Date - 2020-06-22T18:39:52+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కరోనా టెస్టులో నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కరోనా నెగిటివ్

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కరోనా టెస్టులో నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. శ్రీరాముడు, గోమాత దయతో తనకు, తన కుటుంబానికి జరిగిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలిందని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన క్షేమాన్ని కోరిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.   
ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అవ్వడంతో..  రాజాసింగ్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టులు తాజాగా విడుదల అయ్యాయి. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు పాజిటీవ్‌ అని తేలడంతో ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన వారు, సన్నిహితుల్లోనూ ఆందోళన గురయ్యారు. రాజాసింగ్‌ కుటుంబం హోం క్వారంటైన్‌ అయ్యింది.  ఈ విషయాన్ని రాజాసింగే ట్వీటర్‌ ద్వారా తెలియజేశారు. 


Updated Date - 2020-06-22T18:39:52+05:30 IST