మాట తప్పిన సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-12-29T03:49:40+05:30 IST

మాట తప్పిన సీఎం కేసీఆర్‌

మాట తప్పిన సీఎం కేసీఆర్‌
వర్ధన్నపేటలో మాట్లాడుతున్న కొండేటి శ్రీధర్‌

హామీల విస్మరణపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ ధ్వజం

వర్ధన్నపేట, డిసెంబరు 28 : ఎన్నికల వేళ దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దళితుడేనని హామీ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాటతప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ విమర్శించారు. సోమవారం వర్ధన్నపేటలో బీజేపీ అనుబంధ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దళితుల పేరు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్‌, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమం ఆపమని స్పష్టం చేశారు. 


తప్పులు కప్పి పుచ్చుకునేందుకే ధర్నా నాటకం

సంగెం:  ఎమ్మెల్యేలు వారి తప్పులు కప్పి పుచ్చుకునేందుకే ఽధర్నా నాటకాలు ఆడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ ఆరోపించారు. సోమవారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దిగజారుడు ప్రకటనలు ఇస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఛీత్కారం తప్పదని చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గాడిపెల్లి రాజేశ్వరరావు, ఆర్‌పి జయంత్‌లాల్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T03:49:40+05:30 IST