కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: డీకే అరుణ

ABN , First Publish Date - 2020-06-19T10:08:28+05:30 IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: డీకే అరుణ

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: డీకే అరుణ

హైదరాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో పాజిటివ్‌ రేటులో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని, వైరస్‌ వ్యాప్తి లేదంటూ ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గచ్చిబౌలిలో కొవిడ్‌ ఆస్పత్రిని ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు నిర్వహించాలని, గ్రేటర్‌ హైదరాబాద్‌లో డివిజన్ల వారీగా కేసుల వివరాలు వెల్లడించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


చైనా దురాగతాలపై కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల తీరు విచారకరమని బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. చైనాకు మద్దతు తెలిపే రీతిలో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా మౌనంగా ఉండటాన్ని ఆక్షేపిస్తున్నట్లు పొంగులేటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-06-19T10:08:28+05:30 IST