వరంగల్‌లో బండి సంజయ్ పర్యటన
ABN , First Publish Date - 2020-09-03T18:41:33+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం జిల్లాలోని నర్సంపేటలో పర్యటిస్తున్నారు.

వరంగల్ రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం జిల్లాలోని నర్సంపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దోచుకోవడం దాచుకోవడమే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పని అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అక్రమాలను అడ్డుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.