కేసీఆర్‌ డ్రామాలను ప్రజలు నమ్మరు: లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2020-12-17T21:44:54+05:30 IST

హైదరాబాద్‌లో అరుపులు.. ఢిల్లీలో కాళ్లు పట్టుకోవడం సీఎం కేసీఆర్‌కు అలావాటేనని బీజేపీ నేత లక్ష్మణ్‌ ఆరోపించారు.

కేసీఆర్‌ డ్రామాలను ప్రజలు నమ్మరు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అరుపులు.. ఢిల్లీలో కాళ్లు పట్టుకోవడం సీఎం కేసీఆర్‌కు అలావాటేనని బీజేపీ నేత లక్ష్మణ్‌ ఆరోపించారు. వంగి వంగి దండాలు పెడుతున్న కేసీఆర్‌ తీరు ప్రజలకు అర్ధమైందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ రైతులకు ఎందుకు మద్దతు తెలుపలేదని లక్ష్మణ్‌  వ్యాఖ్యానించారు. సన్నధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తూర్పార పట్టారు. దళారుల జేబులు నింపడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు కేసీఆర్‌ భజన సంఘాలుగా మారాయని విమర్శించారు. ఎదురుగాలి వీస్తోందనే ఉద్యోగాల భర్తీ అని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ డ్రామాలను ప్రజలు నమ్మరని  చెప్పారు. 

Updated Date - 2020-12-17T21:44:54+05:30 IST