బీజేపీలోకి భారీగా వలసలు

ABN , First Publish Date - 2020-12-12T05:21:53+05:30 IST

బీజేపీలోకి భారీగా వలసలు

బీజేపీలోకి భారీగా వలసలు
కార్యకర్తల సమావేశంలో కిషన్‌రెడ్డిని సన్మానిస్తున్న బీజేపీ శ్రేణులు

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో చేరిక

కేయూ క్యాంపస్‌, డిసెంబరు 11: హన్మకొండలోని పీవీఆర్‌ గార్డెన్‌లో శుక్రవారం జరిగిన అర్బన్‌ జిల్లా స్థాయి బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సమక్షంలో పలువురు నాయకుల బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ నేత అచ్చ విద్యాసాగర్‌, ఆకారపు మోహన్‌, సినీ డిస్ట్రిబ్యూటర్‌ ఆడెపు శ్రీనివాస్‌, మట్ట రాజశేఖర్‌రెడ్డి, చిర్ర నర్సింగ్‌ గౌడ్‌, ముద్రగడ్డ అనిల్‌కుమార్‌, పైడిపల్లి వంశీ, కేశోజు వెంకట్‌, గీత మధుమోహన్‌ ఉన్నారు. అలాగే వరంగల్‌ ఒకటో డివిజన్‌ నుంచి తిరుపతి, జన్ను ఆరోగ్యంలో ఆధ్వర్యంలో 70మంది, 37వ డివిజన్‌ నుంచి నానునాయక్‌, కంది యాదగిరి, ఉప్పుల రాజు ఆధ్వర్యంలో 60మంది, 37వ డివిజన్‌లోని నవనగిరి నిర్మల ఆధ్వర్యంలో డాక్టర్‌ ప్రియాంక, డాక్టర్‌ తిలక్‌, కుమారస్వామి, శేఖర్‌, రఘు, కిశోర్‌ చేరారు. అలాగే 21, 30, 31, 42, 40, 42వ డివిజన్ల నుంచి వెంకటేశ్‌ ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు నాంపెల్లి శ్రీనివాస్‌, డాక్టర్‌ మన్మోహన్‌రాజు, సీతామహాలక్ష్మి, బొమ్మ రవిగౌడ్‌, టేకుమట్ల రేణుకాయాదవ్‌ ఆధ్వర్యంలో 30 మంది, 47వ డివిజన్‌ నుంచి యారా సతీశ్‌,  ఆధ్వర్యంలో 20మంది యువకులు, 54వ డివిజన్‌ నుంచి పోరిక రాజునాయక్‌, నన్నపురెడ్డి జగన్‌ తదితరులు బీజేపీలో చేరారు. కాగా, ఇదే సమావేశంలో కిషన్‌రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, కిసాన్‌ మెర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గజామాలతో ఘనంగా సన్మానించారు. కురుమ సంఘం, ఆర్యవైశ్య చైతన్య పోరాట సంఘం, నిట్‌ ఎంప్లాయీస్‌ అసోషియేషన్‌ బాధ్యులు కూడా సన్మానించారు.


నూతన పోలీసుస్టేషన్‌ ఏర్పాటు చేయాలి

పోచమ్మమైదాన్‌: ఒకటో డివిజన్‌ పరిధిలో నూతన పోలీ్‌సస్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు కృషిచేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు జన్ను ఆరోగ్యం కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని శుక్రవారం డివిజన్‌ బీజేపీ శ్రేణులు మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే ఒకటో డివిజన్‌లో ఇంటర్నేషనల్‌ స్టేడియం, కోచింగ్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరుతూ  మాజీ ఎంపీటీసీ ఇట్యాల శ్రీనివాస్‌ వినతిపత్రం ఇచ్చారు. 


కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఘనస్వాగతం

ధర్మసాగర్‌: కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ధర్మసాగర్‌ మండలం కరుణాపురం జాతీయ రహదారి వద్ద బీజేపీ నాయకులు శుక్రవారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన బీజేపీ జెండాను ఎగరవేశారు. బీజేపీ నాయకులు విజయరామారావు, శ్రీనివా్‌సరెడ్డి, ఆకారపు దేవయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:21:53+05:30 IST