ఎన్టీఆర్‌పై బీజేపీ కపట ప్రేమ : ఎల్.రమణ
ABN , First Publish Date - 2020-11-27T07:42:01+05:30 IST
ఎన్టీఆర్‌పై బీజేపీది కపట ప్రేమ అని టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు.

ఎన్టీఆర్‌పై బీజేపీది కపట ప్రేమ అని టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం రెచ్చగొట్టేలా మాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. పీవీ, ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని టీడీపీ ఎప్పటి నుంచో కోరుతోందని చెప్పారు. నేటికీ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వని బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు.
గురువారం ఎన్టీఆర్ భవన్‌లో రమణ మాట్లాడుతూ.. పోచమ్మకుంటలోని ఒవైసీ మెడికల్ కాలేజీ ఎక్కడ ఉందని నిలదీశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలుగు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పద్ధతి మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.