భైంసా అల్లర్ల బాధితులకు బీజేపీ గల్ఫ్ విభాగం సాయం
ABN , First Publish Date - 2020-03-02T09:48:21+05:30 IST
భైంసాలో ఇటీవల జరిగిన అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు బీజేపీ గల్ఫ్ విభాగం అండగా నిలిచింది. బీజేపీ గల్ఫ్ విభాగం కన్వీనర్ నరేంద్ర పన్నీరు, మరికొందరు ప్రవాసులు మస్కట్ నుంచి భైంసాకు

(గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
భైంసాలో ఇటీవల జరిగిన అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు బీజేపీ గల్ఫ్ విభాగం అండగా నిలిచింది. బీజేపీ గల్ఫ్ విభాగం కన్వీనర్ నరేంద్ర పన్నీరు, మరికొందరు ప్రవాసులు మస్కట్ నుంచి భైంసాకు వెళ్లి బాధితులకు ఆర్థిక సాయం అందించారు. మొత్తం ఇరవై కుటుంబాలకు రూ.10వేల చొప్పున సాయం అందజేసినట్లు నరేంద్ర పన్నీరు ఓ ప్రకటనలో తెలిపారు. ఒమాన్ కన్వీనర్ కుమార్ మంచికట్ల ఆధ్వర్యంలో బాపురెడ్డి రాజిరెడ్డి, ప్రభాకర్ సిరిమల్లె, హన్మాండ్లు ముక్కెర, నరేష్ ఆంబోజి, అల్లే గంగాధర్, ముఖ్య కార్యకర్తలు స్పందించి విరాళాలు అందజేశారని తెలిపారు. బాధితులకు ఎన్నారైలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.