గ్రేటర్ ఎన్నికల్లోపే బీజేపీలోకి భారీగా చేరికలు: లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2020-11-16T00:51:57+05:30 IST

బీజేపీలోకి వలసలు ఆపటానికే సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్‌ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లోపే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని ప్రకటించారు.

గ్రేటర్ ఎన్నికల్లోపే బీజేపీలోకి భారీగా చేరికలు: లక్ష్మణ్‌

హైదరాబాద్: బీజేపీలోకి వలసలు ఆపటానికే సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్‌ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లోపే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని ప్రకటించారు. బీజేపీకి భయపడే గడువు కంటే ముందే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలే గ్రేటర్‌లో పునరావృతం కాబోతున్నాయని లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కరోనా, వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, ఎంఐఎం ముక్త్ హైదరాబాద్ తమ లక్ష్యమని లక్ష్మణ్‌ ప్రకటించారు.


అంతకుముందు బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశమయ్యారు. ఈ పార్టీ నేత బండి సంజయ్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డీకే అరుణ, అరవింద్, లక్ష్మణ్, మురళీధరరావు  పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, జితేందర్ రెడ్డి, వివేక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రణాళిక, గ్రేటర్‌లో బండి సంజయ్ పాదయాత్రపై చర్చించినట్లు సమాచారం. 

Updated Date - 2020-11-16T00:51:57+05:30 IST