నగరాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2020-12-14T04:23:55+05:30 IST

నగరాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

నగరాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న రాజేశ్వర్‌రావు

బీజేపీ నేత, మాజీ మేయర్‌ రాజేశ్వర్‌రావు

మట్టెవాడ, డిసెంబరు 13 : నగరాభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మేయర్‌ టి.రాజేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ నగరానికి ఏడాదికి రూ.300కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తానని తెలిపారని, అవి ఇంతవరకూ మంజూరు కాలేదన్నారు. మంత్రి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, నగరానికి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నిధులు అడిగే ధైర్యం లేక బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా హన్మకొండ బాలసముద్రంలో పార్కు స్థలాన్ని పార్టీ ఆఫీసుకు కేటాయించారని ఆరోపించారు. ఆరేళ్లయినా మాస్టర్‌ప్లాన్‌ను ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. జిల్లా ప్రజా ప్రతినిధులకు  కాంట్రాక్టులు, భూకబ్జాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని విమర్శించారు. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ.. అధికారంకోసం పార్టీలు మార్చే మంత్రి దయాకర్‌రావుకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు,  కొండేటి శ్రీధర్‌, మందాటి సత్యనారాయణరెడ్డి, బీజేపీ నాయకులు బాకం హరిశంకర్‌, సంగాని జగదీశ్వర్‌, గురుమూర్తి శివకుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సంతో్‌షరెడ్డి, మండల సురేష్‌, రాజేంద్రప్రసాద్‌, రావుల కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-14T04:23:55+05:30 IST