నిరుద్యోగ భృతి చెల్లించాలి

ABN , First Publish Date - 2020-12-30T05:14:34+05:30 IST

నిరుద్యోగ భృతి చెల్లించాలి

నిరుద్యోగ భృతి చెల్లించాలి
ధర్నా చేస్తున్న బీజేవైఎం, బీజేపీ నాయకులు

బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా

సంగెం, డిసెంబరు 29: నిరుద్యోగులను ఆదుకునేందుకు నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ డిమాండ్‌ చే శారు. సోమవారం బీజేవైఎం రూరల్‌ జిల్లా  అధ్యక్షుడు తాటికొండ రవికిరణ్‌ ఆధ్వర్యంలో నాయుడు పంపు వద్ద ధర్నా నిర్వహించారు. కొండేటి మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి ఓట్లు పొంది టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి అందిస్తామని, మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కిన అనంతరం ప ట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రవికిర ణ్‌ మాట్లాడుతూ యువతను మోసం చేసిన కేసీఆర్‌కు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో  పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి  కొండి జితేందర్‌రెడ్డి బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శులు ఎరుకల దివాకర్‌, నూనె అనిల్‌, పెంచాల సతీష్‌, జిల్లా నాయకులు మహేందర్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌, సతీష్‌, జంగిలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:14:34+05:30 IST