కొడాలి నానిని బర్తరఫ్‌ చేయాలి:బీజేపీ

ABN , First Publish Date - 2020-09-25T08:27:44+05:30 IST

ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిని తక్షణం కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు...

కొడాలి నానిని బర్తరఫ్‌ చేయాలి:బీజేపీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిని తక్షణం కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంత్రివర్గంలో ఉంటూ హిందూ సమాజం, ఆలయ నిబంధనలపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.  నానిని కేబినెట్‌ నుంచి తొలగించడమే కాకుండా, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, కాళేశ్వరంతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందివ్వడం వల్ల కరెంటు మోటార్లు, వాటికి మీటర్లు అవసరమే ఉండదంటూ గతంలో హరీశ్‌ చెప్పిన మాటలు నీటి మూటలేనా? అని బీజేపీ నేతదుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ ప్రశ్నించారు.

Updated Date - 2020-09-25T08:27:44+05:30 IST