కేంద్ర మంత్రులపై దాడి యత్నానికి బీజేపీ ఖండన

ABN , First Publish Date - 2020-09-13T06:42:55+05:30 IST

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర

కేంద్ర మంత్రులపై దాడి యత్నానికి బీజేపీ ఖండన

హైదరాబాద్‌,  సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

స్థానిక పోలీసుల వైఫల్యం వల్లనే టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.  ఉద్యోగాల పేరు చెప్పి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు రూ.కోట్లు వసూలు చేశారన్న స్థానికుల ఆరోపణపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-09-13T06:42:55+05:30 IST