మాదాపూర్‌లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2020-12-01T17:41:15+05:30 IST

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మాదాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు దొర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మాదాపూర్‌లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మాదాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు దొర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ డివిజన్ పోలింగ్ బూత్‌లలో పోలీసుల సాయంతో ఓటర్లకు టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ చెబుతోంది. డబ్బుల పంపిణీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్‌కు మాదాపూర్ పోలీసులు వత్తాసు పలుకుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.



Updated Date - 2020-12-01T17:41:15+05:30 IST