నిరుద్యోగులను మోసగించిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-12-16T04:39:49+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలో ఇంటికో ఉద్యోగం క

జిల్లాలో బీజేపీ, బీజేవైఎం ఆందోళనలు
పరకాల, డిసెంబరు 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో మేఘనాథ్, ఆర్పీ జయంత్‌లాల్, ఎం.రాజవీరు, ఎం.భిక్షపతి, రేవన్‌సిద్ధు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట: ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లు, కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు తొమ్మిది నెలల వేతనాన్ని బోనస్‌గా అందించాలని ప్రభుత్వాన్ని బీజేవైఎం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాటికొండ రవికిరణ్, పెంచల సతీష్ డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాలయ ఉద్యోగికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ వడ్డెపెల్లి నర్సింహరాములు, సెంట్రల్ రైల్వేబోర్డు సభ్యుడు రేసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బాల్నెజగన్ తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట: నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నూనె అనిల్, ఏలిశాల రాకేష్, చెంగల సురేష్, కుందూరు మహేందర్‌రెడ్డి, పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు.
దామెర: నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, దామెర సర్పంచ్ గురిజాల శ్రీరాంరెడ్డి డిమాండ్ చేశారు. దామెరలో బీజేవైఎం జిల్లా కోశాధికారి సూర చందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, తహసీల్దార్ ఎన్.హేమకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రాజ్‌కుమార్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట: నిరుద్యోగులను ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్ రెడ్డి ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాయరాకుల మొగిలి, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, నాయకులు వంశీ, నాగరాజు, తిరుపతి, దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సంగెం : ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ యువమోర్చా సంగెం మండల అధ్యక్షుడు వడ్డె దేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తహసీల్దార్ రమేశ్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సంగెం మండల కార్యదర్శి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి: నిరుద్యోగులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేవైఎం మండల అధ్యక్షుడు రాపాక ప్రశాంత్ ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించి తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు.
పర్వతగిరి: బీజేవైఎం మండలశాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపెల్లి సంతోష్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: నిరుద్యోగులకు భ్రుతి కల్పించాలని మండల బీజేవైఎం నాయకులు తహసీల్దార్ వివేక్‌కు వినతి పత్రాన్ని అందచేశారు.