ఏపీ-తెలంగాణ భవన్ ముందు బీజేపీ ఆందోళన
ABN , First Publish Date - 2020-10-07T08:26:17+05:30 IST
తెలుగు రాష్ట్రాల సీఎంలు కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు.

న్యూఢిల్లీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల సీఎంలు కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ పోరాటం చేయాలంటూ మంగళవారం ఢిల్లీలోని ఏపీ-తెలంగాణ భవన్ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
కాగా, నదీ జలాల వాటా కేటాయింపులో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలోని పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు.