4 అసెంబ్లీ సెగ్మెంట్లలో కమలం హవా
ABN , First Publish Date - 2020-12-07T09:25:38+05:30 IST
రెండేళ్లలో ఎంతమార్పు! 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి అదనంగా మరో నాలుగు అసెంబ్లీ స్థానాలను దక్కించుకునే స్థాయికి ఎదిగింది

పూర్తిస్థాయి ఆధిక్యం కనబరిచిన బీజేపీ
రెండేళ్లలో అనూహ్యంగా పెరిగిన బలం
గోషామహల్‌లో పట్టునిలుపుకొన్న కాషాయదళం
మిగిలిన చోట్లా గణనీయంగా ఓట్లు
భారీగా ఓట్లు కోల్పోయిన టీఆర్‌ఎస్
ఖైరతాబాద్‌లో మాత్రం పెరుగుదల
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో ఎంతమార్పు! 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి అదనంగా మరో నాలుగు అసెంబ్లీ స్థానాలను దక్కించుకునే స్థాయికి ఎదిగింది. అంతేకాదు మిగిలిన నియోజకవర్గాల పరిధిలోనూ గణనీయంగా ఓట్లను సాధించి అధికార టీఆర్‌ఎస్ పార్టీకి సవాలు విసురుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లను విశ్లేషిస్తే తన సిటింగ్ స్థానం గోషామహల్‌తోపాటు ఎల్‌బీనగర్, ముషీరాబాద్, అంబర్‌పేట్, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యం సంపాదించింది. ముఖ్యంగా ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో బీజేపీ ఏకంగా 1,29,519 ఓట్లు సాధించింది. ఇక్కడ టీఆర్‌ఎస్ 86వేల ఓట్లు సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున సుఽధీర్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఇక అంబర్‌పేట్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60,542 ఓట్లు సాధించగా ప్రస్తుత ఎన్నికల్లో ్ల 60,476 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్‌ఎస్ కంటే బీజేపీకి 8వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తన పట్టు నిలబెట్టుకున్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికలకంటే ఆ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఒక్క ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాత్రం గతంలో సాధించిన ఓట్ల(63వేలు) కంటే మూడు వేల ఓట్లు అధికంగా సాధించింది.
అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీకి వచ్చిన ఓట్లు (పలు నియోజకవర్గాల్లో)
నియోజకవర్గం పార్టీ అసెంబ్లీ జీహెచ్‌ఎంసీ
(2018) (2020)
రాజేంద్రనగర్ టీఆర్‌ఎస్ 1,08,964 42,764
బీజేపీ 19,627 43,498
సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ 79,309 59,220
బీజేపీ 11,781 47,253
కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ 1,54,500 97,720
బీజేపీ 9,833 67,185
ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ 63,068 66,071
బీజేపీ 34,666 55,606
శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ 1,43,005 1,19,369
బీజేపీ 22,073 90,270
కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ 1,11,612 1,02,645
బీజేపీ 11,943 73,205
జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్ 67,213 56,972
బీజేపీ 8,185 37,902
ఉప్పల్ టీఆర్‌ఎస్ 1,17,442 92,322
బీజేపీ 26,798 76,255
మల్కాజిగిరి టీఆర్‌ఎస్ 1,14,149 65,065
బీజేపీ 40,459 60,457
సనత్‌నగర్ టీఆర్‌ఎస్ 66,464 52,791
బీజేపీ 14,247 49,783
ఎల్‌బీనగర్ టీఆర్‌ఎస్ 96,303 86,090
బీజేపీ 21,563 1,29,519
గోషామహల్ టీఆర్‌ఎస్ 44,120 39,465
బీజేపీ 61,854 62,624
ముషీరాబాద్ టీఆర్‌ఎస్ 79,461 50,377
బీజేపీ 30,625 56,875
అంబర్‌పేట్ టీఆర్‌ఎస్ 61,558 52,331
బీజేపీ 60,542 60,476