సెల్లార్‌లో పార్క్‌ చేసిన బైక్‌ తెల్లారేసరికి మాయం

ABN , First Publish Date - 2020-12-27T12:55:43+05:30 IST

పార్కింగ్‌ చేసిన బైక్‌ని అపహరించిన సంఘటన జీడిమెట్ల

సెల్లార్‌లో పార్క్‌ చేసిన బైక్‌ తెల్లారేసరికి మాయం

హైదరాబాద్/జీడిమెట్ల : పార్కింగ్‌ చేసిన బైక్‌ని అపహరించిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. షాపూర్‌నగర్‌లో నివాసముండే ముడిమళ్ల శ్రవణ్‌కుమార్‌ తన మామయ్య సదానందగౌడ్‌ వద్ద ద్విచక్ర వాహనాన్ని(టీఎస్‌ 07 టీవై 2246) అవసరం నిమిత్తం 24న తీసుకున్నాడు. పని ముగించుకుని అదే రోజు రాత్రి 7గంటలకు బైక్‌ను అతని మామయ్య నివాసముండే జంగయ్య గౌడ్‌ ఎన్‌క్లేవ్‌, ప్లాట్‌ నెంబర్‌ 17,18లోని సెల్లార్‌లో పార్కు చేశాడు. మరుసటి రోజు ఉదయం7 గంటలకు చూడగా ద్విచక్ర వాహనం లేదని శ్రవణ్‌కుమార్‌ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-12-27T12:55:43+05:30 IST