పెళ్లింట్లో దొంగతనం.. పెద్ద ఎత్తున బంగారం, నగదు అపహరణ
ABN , First Publish Date - 2020-12-19T12:59:24+05:30 IST
మహబూబ్‌నగర్: పెళ్లి ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లిలో జరిగింది. సుమారు 200 తులాల బంగారు ఆభరణాలు...

మహబూబ్‌నగర్: పెళ్లి ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లిలో జరిగింది. సుమారు 200 తులాల బంగారు ఆభరణాలు... ఎనిమిది లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి ముగ్గురు దొంగలు చొరబడి.. కూతురి వివాహం కోసం తెచ్చిన నగలతో పాటుగా కుటుంబసభ్యుల ఆభరణాలను సైతం దొంగిలించారు. ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే నిదిరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.