ధరణి పోర్టల్‌లో తప్పుడు సమాచారం ఎంట్రీ : భట్టి

ABN , First Publish Date - 2020-10-13T23:59:21+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో తప్పుడు సమాచారం ఎంట్రీ చేశారని

ధరణి పోర్టల్‌లో తప్పుడు సమాచారం ఎంట్రీ : భట్టి

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో తప్పుడు సమాచారం ఎంట్రీ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ధరణి పోర్టల్‌లో అనుమానాలను ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు నివృత్తి చేయలేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌లో తప్పుడు సమాచారం ఎంట్రీ చేశారని.. దాని ఆధారంగా మార్పులు చేస్తే మరిన్ని తప్పులు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు.


ఈ విషయంపై సభలో మాట్లాడటానికి ప్రతిపక్షాలకు కనీసం మైక్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం హడావిడిగా అసెంబ్లీ పెట్టి తమకు కావాల్సిన బిల్లులను ఆమోదించుకుందని విమర్శించారు. ప్రజల సమస్యలను ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. శాసనసభలో కనీస సంప్రదాయాలు కూడా పాటించడం లేదని.. సభ ప్రజాస్వామ్య యుతంగా నడవాలని భట్టి హితవు పలికారు.

Updated Date - 2020-10-13T23:59:21+05:30 IST